Verse 1
అద్భుతములు చేయు దేవుడు - నన్ను ఆశ్చర్య మార్గములో నడుపుచున్నాడు
కరుణామయుడు కనికర సంపన్నుడు-నాజీవిత నావకు నావికుడై యున్నాడు
Verse 2
దుష్టశక్తులెన్నో ఎగసి వచ్చినా
లోకాశ ఇచ్ఛలను చూపించినా
ఎన్నటికీ కదలవు నీ అడుగులు జారవు
నా నీడలో నుందువని ఆనతి నిచ్చాడు
చెదరను నేను స్థిరముగా నుండెదన్
నిత్యము నాయేసునే ఆశ్రయింతును ||అద్భుతములు ||
Verse 3
పోరాటము భయము ఆవరించినా
ఆత్మహత్య ఆలోచన అంకురించినా
క్రీస్తువలన లోకము ద్వేషించినా
రక్తసంబంధులే దూషించినా
బెదరను నేను స్థిరముగా నుండెదన్
నిత్యము నాయేసుతో ఆనందింతును ||అద్భుతములు ||
Verse 4
ఈలోకము పలువిధాల శ్రమల వలయము
పరలోకము శాశ్వత ఆనంద నిలయము
తన నీతిని ప్రేమించే తన భక్తులను
ఎన్నటికి విడువనని వాగ్ధానమిచ్చెను
అందుకే నేను ఈమార్గము విడువను
నిత్యము నాయేసులో ఆరాధింతును
తప్పక ప్రభునామమునే ప్రకటింతును ||అద్భుతములు ||