సేవకులం సువార్త సేవకులం - కాపరులం సమాజ కాపరులం
మనమంతా జతపనివారం - దేవునితో జతపనివారం
దేవునిచే పిలువబడినాం - దేశమునకై నిలువబడినాం
జాతుల బేధంలేని మనం రాజులం మరి యాజకులం
మన చిరునామం దైవజనం ఓహో సువార్తికులం ||మనమంతా ||
అడవులలో ఎడారులలో పల్లెలలో పట్నాలలో
ప్రజలకు ప్రభు పరిచారకులం జనులకు రక్షణకారకులం
సాతానుడి సంహారకులం ఓహో సువార్తికులం ||మనమంతా ||
అవమానాలూ అగచాట్లు - పస్తులకూ పాట్లకూ
జడియని ధైర్యశాలురం - విసుగని శాంతి ధీరులం
ఆత్మల పట్టే జాలరులం - ఓహో సువార్తికులం ||మనమంతా ||
సంస్థా భేదములు వీడి - సహవాసంబుగా కూడి
ప్రాణమిత్రులుగా ఆప్తులుగా - ప్రభువునందు సహదాసులుగా
కలిసుందాం - కలుసుకుందాం - ఓహో సువార్తికులం ||మనమంతా ||
నశియించే మనదేశాన్ని రక్షించే బాధ్యులం
భారత క్రైస్తవ వీరులం - సంఘాలలో ప్రభుదూతలం
వీధుల సువార్త వ్రాతలం - ఓహో సువార్తికులం ||మనమంతా ||