Verse 1
కలువరి గిరిలోన - తులువలమగు మాకై
శ్రమనొందినావయ్యా - వెలుగొందినావయ్యా || కలువరి ||
Verse 2
ఇలపాపము చేసినదెవరు - ఇలలోన మనజులెగా
పలుకాకు చేష్టలతో - నిను శ్రమనొందించితిరిగా
విసిగించియూ - శృతిమించియూ
చేశారు పాపములు - వేశారు నిను సిలువ ||కలువరి ||
Verse 3
నా పాప క్షమాపణ కొరకై - బలియైతివా ప్రభువా
నీ సిల్వ రక్తముతో - నను శుద్ధిగా చేసితివా
విలువైనది ఘనమైనదీ - వేరెవ్వరివ్వనిదీ
నీ ప్రేమ నిచ్చితివా ||కలువరి ||