Verse 1
విజయమిమ్ము నా బ్రతుకునందు
నిజరక్షకా నా యేసునాధా
Verse 2
అధమమైన నా జీవితాన - అధిక కృపతో ప్రేమించిబ్రోచి
నిత్యజీవపు పధమునందు - అనుదినమునను
పయనింపజేసి - పయనింపజేసి ||విజయమిమ్ము ||
Verse 3
శోధన నిండిన ఈ లోకమందున
అడుగు అడుగున హృదయ వేదన
నిందలందునా నిన్నే గురిచూసి - ప్రేమవిందుకైనిను వెంబడింప
ప్రేమవిందుకై నిన్ను వెంబడింప ||విజయమిమ్ము ||
Verse 4
మహిమకరమైన శాశ్వత వెలుగులో - కుహములన్నియు గెలచి నిలిచి
అహమునంతయు అణచివేసి - ఇహమునందున
నిన్నేచాటను - ఇహమునందున నిన్నే చాటను ||విజయమిమ్ము ||
Verse 5
సకల సృష్టికి కర్తవునీవై - నమ్మినవారికి భర్తవు నీవు
అవసరాలలో హర్తవునీవై - పరమలోకముక్తి దాతవై
పరమలోక ముక్తి దాతవై ||విజయమిమ్ము ||