Verse 1
బూరధ్వని ధ్వనియించగా - ఇమ్మహికేసు అరుదెంచుగా - 2
పరమేగి స్తుతిగీతి పాడగా - కొనిపోవు దూతాళితోడ - 2
Verse 2
నా పాపశాపం ప్రియుడేసు మోసెను
అవమాన భారం రూపుమాపెను - 2
ఆనంద భరితుడనై వినీల మేఘాలపై
కొనిపోబడుదును దూతాళితో - 2 ||బూరధ్వని ||
Verse 3
ఆ నిత్యమహిమ మోక్ష నగరమునకు
అక్షయ రాజ్యములో మహిమ తలాంతులతో - 2
ఆనంద గానాలతో ఆత్మీయ రాగాలతో - 2
కొనిపోబడుదును దూతాళితో - 2 ||బూరధ్వని ||