Verse 1
యేసుతో నడువుమా సంఘమా - యేసుతో నిలువుమా సంఘమా
యేసే నీ సర్వమని ఎరుగుమా - యేసుకొరకు సాగుమా సంఘమా || యేసుతో ||
Verse 2
యేసుతో నిలిచే ఓ సంఘమా - యేసుకు అనుకూలముగా నిలువుమా
ఏదేని లోపము నీకుండిన - యేసు రూపమునకు సరిచేసుకో
మాసిన నీ జీవితము కడుగుమా - వాసికెక్కి ప్రభునికొరకు సాగుమా ||యేసుతో ||
Verse 3
యేసుతో నిలిచే ఓ సంఘమా - యేసు క్రియలు నీలో జరిపించుమా
యేసు కొరకు నిలిచే ఓ సంఘమా - యేసు ఆత్మలో నివసించుమా
ఏ కష్టనష్టములు వచ్చినా - యేసు కొరకు నిలువుమా సంఘమా ||యేసుతో ||