Verse 1
నీ కార్యము యేసు సంపూర్ణము
నీవు చేసినది నిలుచును నిత్యము
మహిమాన్వితం నీ కార్యము-మానవ ఊహకు అతీతము
Verse 2
నా చీకటంతా వెలుగాయెనే - నా దుఃఖమే నాట్యముగ మారెనే
నా నోటినిండా స్తుతిగానమే - ఈ గొప్ప రక్షణ నీ దానమే ||ఎంతో ||
Verse 3
ఆటంకపు నది దాటించుచూ-చెలరేగు అలలన్ని నీవణచుచూ
మరణాన్ని వెనుకకు మరలించినా - మొరలాలకించిన ఘనదైవమా ||ఎంతో ||
Verse 4
నా ఆశ్రయ దుర్గము నీవయా -నా ఆశలకు ఊపిరి నీవయా
నా అతిశయకారణమీవయా-నా కాదరణ నీవే యేసయ్యా ||ఎంతో ||
Verse 5
గతించనివి నీ మాటలు - బ్రతికించిన జీవపు ఊటలు
నీవిచ్చిన ప్రతి మాట - వరమాయె దేవా నా పాలిట ||ఎంతో ||
Verse 6
నీ సిలువలో కలిగె పరిహారము - శాపానికి పాప రోగానికి
నా నిరీక్షణకు ఆధారము - నా యేసు నీ పునరుత్థానము ||ఎంతో ||
Verse 7
ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు నా చెంత
వింత కార్యము చేసే దేవా నీకే మహిమంత