Verse 1
యౌవనుడా నీ యౌవన కాలమందే - నీ సృష్టికర్తను గుర్తు చేసుకో
శక్తికి మూలము తాను - ముక్తికి మూలము తాను
భక్తితో ఆశ్రయించు - నిత్యము ప్రస్తుతించు
Verse 2
నీ బలము - నీ ఘనము - ఆయన వరమేలే
నీ జ్ఞానం - నీ ధ్యానం - ఆయన కృపయేలే
అణువణువు ప్రభు పనితనమే
ఆ ప్రభుకై బ్రతుకే ఒక వరమే ||యౌవనుడా ||
Verse 3
నీ రూపం - నీ దేహం - ఆయన వరమేలే
ప్రతిశుభము - అనుదినము - ఆయన మేలేలే
సకల తలాంతులు ప్రభువేలే - సర్వము ఆయన కొరకేలే ||యౌవనుడా ||
Verse 4
క్షణికమగు ఈ బ్రతుకు - శాశ్వతము కావలె
జీవములో మనమంతా - ప్రభు చెంత నిలువవలె
హల్లెలూయ స్తుతి మహిమల్ - ఎల్లరు కూడి పాడవలె ||యౌవనుడా ||