Verse 1
మనసంతా నీ ఊహలే - యేసయ్యా
మదినిండా నీ ఊసులే - మెస్సీయా
ఈ జీవితాన నిను చుడాలన్నదే
నా .... హృదిలోని ధృడమైన వాంఛయ్యా
Verse 2
వడివడిగా సాగుతున్న - ఒంటరియైన పయనంలో
నిష్టూరాల నిట్టూర్పులలో - విశ్వాసమిచ్చి నిలిపితివి
వాగ్ధానముతో వదలక నడిపి
అబ్రాహాముకు ఆదరణైతివా జీవనాధారమా ||ఆదరించే ||
Verse 3
తోడులేక నీడలేక - కలలే చెదరిన వేళలో
సందేహాలలో - అపాయాలలో - పోరాట పఠిమను ఇచ్చితివి
ఉన్నత పిలుపుతో చేరపిలిచి
మోషేకు మహిమను చూపిన ఘననాయకుడా ||ఆదరించే ||
Verse 4
గురినెరుగక గానుగ మాటున - పిరికి తనపు పయనంలో
శత్రువు చేతికి చిక్కినవాడై - కలతచెంది యున్నపుడు
భయమును బాపి - ధైర్యమునిచ్చీ
గిద్యోనును సరిగా నిలిపిన - విజయవీరుడా ||ఆదరించే ||
Verse 5
ఆదరించే దేవుడా - నీలో ఆనందించెద
ప్రేమ చూపే నాధుడా - నిన్నే నే ప్రకటించెద