ఓ మనసా భయమేలనే - నమ్మదగిన యేసుండు నీకుండగా
యేసయ్య నీ బ్రతుకున వెలుగైయున్నాడు - యేసయ్య నీకు రక్షణయై యున్నాడు
నరులనిన నీకింక భయమేల మనసా - ప్రభువే నా దుర్గముగా నుండగా
ప్రాణంబు దీయునెవరు - నీకింక దిగులేల ఓ మనసా ||ఓ ||
పొరుగువారు కీడు చేతురని భయమా - శత్రువులు నీ పేరు
చెరతురని భయమా - మిత్రులే నిన్నప్పగింతురని భయమా
ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడువ ప్రాణంబు ||ఓ ||
అపకారములెన్నో నీకు సంభవింప - అపవాదము లెన్నో
నీపై మెపబడెను - అపవాది శత్రువులు నిన్నావరింప
ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడువ ప్రాణంబు... ||ఓ ||
నీ భక్తి జీవితము పాడగునని భయమా - శోధనలో పడుదు
నేమోయని భయమా - నాశనమై పోవుదు నేమోయని భయమా
భ్రష్టుండై పోదునేమోయని భయమా ప్రాణంబు... ||ఓ ||
నీ కొరకు బలియైన యేసు ప్రభువుండగా - మృతిని జయించిన
మృత్యుంజయుడుండగా సాతానున్ గెల్చిన శక్తిమంతుడుండగా
నిత్యజీవమునిచ్చు నిజరక్షకుడుండగా - ప్రాణంబు... ||ఓ ||