Verse 1
ఇది మది పాడుచున్న నూతన గీతం - దేవుడు మనకిచ్చిన దయా కిరీటం
దినములు వత్సరములు గడిచెను గతకాలం-వీడని ప్రభుకృపలో నిలవాలి కలకాలం
Verse 2
యేసు మనకు ఏర్పరచిన ఈ మార్గము
నూతన చిర జీవమును మనకిచ్చెను - 2
గమద మదని దనిస నిసగ మా మగస గసని సనిద నిదమగా
వాక్యమనే ఉదకముతో కల్మషమును కడిగెను
పవిత్రతలో నిలుచుటకు ధైర్యము కలిగించెను ||ఇది మది ||
Verse 3
విశ్వాసము నందు మనము స్థిరులై నిలచి
పరిశుద్ధ హృదయమున దేవునితో నడిచి - 2
గమద మదని దనిస నిసగ మా మగస గసని సనిద నిదమగా
వాగ్ధాన వాక్యమును పదిలముగా పట్టుకుని
నిరీక్షణ కలిగి మనము నిశ్చలముగ నుండెదము ||ఇది మది ||