Verse 1
శృంగార నగరమది - నా ఆత్మ చూచుచున్నది
అందాల నగరిలో నాకున్నది - నా యేసు సన్నిధి నాది
సీయోను పురమే నాకున్నది - అంతము కాదు సమాధి || శృంగార ||
Verse 2
కన్నీరే లేదూ కష్టాలే లేవు - శోధన బాధలు లేవు
ఆనందగాన తరంగములు - నా యేసుకే స్తుతి హారతులు ||శృంగార ||
Verse 3
నిత్య మహిమలోనికి పిలుచుకొన్నవాడు - ప్రియుడు మన యేసుడు
కొంత కాలమె ఈ ధరలో క్రీస్తువాడా నీ శ్రమలు ||శృంగార ||
Verse 4
కొండలన్ని ఎగసి - తరలివచ్చు వాడు వరుడు ప్రియుడేసుడు
బూరశబ్ధము వినబడును - క్రీస్తు మహిమను పరికింతును ||శృంగార ||
Verse 5
పరమతండ్రి దరికి నన్ను చేర్చువాడు - కరుణగల ఏసుడు
కొంతకాలమే ఈ పయనం - చేరుకొందును నా సదనం ||శృంగార ||