Verse 1
పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో
వాడ వాడల్లో సొగసైన మేడల్లో
యేసు వార్త చాటను పదరో తమ్ముడా
నాకేమని అనబోకురో
Verse 2
ఈ సువార్త అసలు వినని జనులెందరో
యేసు లేక నశియించు ప్రజలెందరో
ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది
దారి చూపే భారం నీకీయబడినది
యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో ||పల్లె ||
Verse 3
నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా
సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా
కోతెంతో వున్నా పనివారు లేరని
అడుగుచున్నాడేసు తన పని చేయమని
యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో ||పల్లె ||
Verse 4
రాకడకు గురుతులు కనిపించు చుండగా
అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా
సమయం అసమయమనక సందేహపడక
దొరికిన అవకాశమేది జారవిడువక
యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరో ||పల్లె ||