Verse 1
నిత్యమైన ప్రేమతో నిన్ను నన్ను పిలచిన
సత్యమూర్తి యేసుకొరకు త్యాగమై పోదమా
త్యాగమై పోదమా యాగమై పోదమా
త్యాగమై సజీవ యాగమై పోదమా || నీత్యమైన ||
Verse 2
దేవుని కొరకు దేశం కొరకు - ప్రభువు కొరకు ప్రజల కొరని
కరములెత్తి నినాదమిస్తూ - కన్నీటితో ప్రార్ధన చేస్తూ
ఇహలోకపు శ్రమలన్నీ - పరలోకపు సౌఖ్యములేనని
సిలువ యోధులెందరినో - క్రీస్తు కొరకు సమకూర్చుటకు ||త్యాగమై ||
Verse 3
ప్రేమ త్యాగం - సేవ సహనం
క్రీస్తు మనకు నేర్పిన సిలువ ప్రేమ పాఠం
హతసాక్షులుగా నిల్చుటకు - అభిషేకమునందించినది
పరమతండ్రి కుడిపార్శ్వములో పరవశించు వరమిచ్చినది ||త్యాగమై ||