Verse 1
ఆదియు అంతమై యున్నావు - అల్ఫా ఓమేగై ఉన్నావు
అన్ని వేళల అభయమునిస్తూ - ఆశ్రయ దుర్గమై ఉన్నావు
యేసయ్యా మా కాపరి నీవయ్యా - యేసయ్యా మా అండవు నీవయ్యా
Verse 2
ప్రకృతిని నిర్మించావు - నీ ప్రాణము నాలో నింపావు
దృష్టికి నీవు లోబడకుండ - ఫలించమని దీవించావు ||యేసయ్యా ||
Verse 3
జీవాహారమై ఉన్నావు - జీవజలము త్రాగించావు
జీవజలపు నది ఓరను నాటి - చిగుర్చుకొమ్మగ చేసావు ||యేసయ్యా ||
Verse 4
చీకటిని తరిమేయుటకై - వెలుగై అవనికి వచ్చావు
వ్యభిచార స్త్రీకి క్షమాపనిచ్చి - ప్రాణం దానం చేసావు ||యేసయ్యా ||
Verse 5
పాపుల కొరకై వచ్చావు - సిలువలో ప్రాణం పెట్టావు
కుంటీ గ్రుడ్డి సకల రోగులకు - స్వస్థత నిచ్చి బ్రోచావు ||యేసయ్యా ||