Verse 1
నడ్చి నడ్చి వెల్గులో - యేసుతో హల్లెలూయ - నిల్చిననే నిల్తుగా - యేసుతో హా...
త్రోవలోనే నలియగా జీవధారలన్ - త్రాగించి దీర్చుసేదన్ || నడ్చి ||
Verse 2
ప్రభుయేసుని అడుగులలోనేగి - ప్రతినిత్యము నేమది స్తుతియించి
పరిశుద్ధాత్ముని వెల్గులో - పరమపురిన్ జేరెదన్ ||నడ్చి ||
Verse 3
కర్తయేసుని కాంతిలో నేగెదను - కారుచీకటి క్రమ్మిన కడుదీనతన్
కాలుమోపుచు మదిస్తుతిగానముతో - కరుణాళునిన్ జేరిసాగెదన్ ||నడ్చి ||
Verse 4
కర్తయేసుని కాంతిలో నేగెదను - నిత్యమాయన స్వరమునే వినుచు
స్వరమిచ్చెద నీకని నేబల్కుచు - కృపనాధుండేసునితో ||నడ్చి ||
Verse 5
ఆ యేసుని కాంతిలో నేగెదను - అలసి సొలసిన సాయము నొందును
అది సుఖము దుఃఖము చావైన - ఆయేసుతో వెళ్ళెదన్ ||నడ్చి ||
Verse 6
కర్తయేసుని కాంతిలో నేగెదను - కన్నులాతని వైపున నిల్చెను
కడవరకునే నాయన జెండాను - కరమొప్పనెత్తెదను ||నడ్చి ||