Verse 1
రక్షణ పొందితివా - నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదా - నీ భారం తీరినదా....
Verse 2
ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు - ఎందాక ఈ శాపపు పరుగు,
అంతము మరణమెగా - నీ అంతము నరకమెగా... ||రక్షణ ||
Verse 3
ఆగదు సమయం నీ రక్షణకై - ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే - నీ రక్షణ సుదినమిదే... ||రక్షణ ||
Verse 4
ఎన్నాళ్ళుగ ప్రభునెదిరించితివో - ఎంతగ ప్రభుని విసిగించితివో
కొంచెము యోచించు - నీవించుక గమనించు... ||రక్షణ ||
Verse 5
పాపమునుండి తిరుగుమునేడు - పాపిని ప్రభువా మన్నించుమనీ,
పరితాపము పొంది - ప్రార్థించుము ఈ దినమే... ||రక్షణ ||
Verse 6
ప్రేమామయుడు - ప్రభువగు క్రీస్తు
ప్రాణము పెట్టెను సిలువలో - నీకై
పాపము తొలగించున్ - నీ శాపము పరిమార్చున్ ||రక్షణ ||