Verse 1
ఇదిగో! మనుష్యుల మధ్యలో
దేవాది దేవుడు - నివాసం చేయుచున్నాడు
Verse 2
దేవుని నివాస స్థలం - తమ జనుల మధ్యలో
దేవుడు తన వారికి దేవుడై యుండి - కన్నీరంతయు తుడుచుచుండెను ||ఇది ||
Verse 3
దేవుని ఆలయము ఆయనే - పరిశుద్ధ దీపము ఆయనే
జీవము ద్వారా తన జనులను - దాహంతీర్చు శుద్ధజీవనదియు ఆయనే ||ఇది ||
Verse 4
పూర్ణ మహిమతో నిండియున్న - మహాపరిశుద్ధ స్థలం అదియే
నిరంతరము స్తుతులతోనే గుమ్మములో మా పాదములు నిలువబడును ||ఇది ||
Verse 5
ముందెళ్ళిన యేసుప్రభువు - మూలరాయయిన సీయోనులో
నివసించే ఉన్నత శిఖరమది - వాంఛతోనే వెంటాడుదం ||ఇది ||