Verse 1
ప్రక్షాళనా - ప్రక్షాళనా - ప్రక్షాళనా
మారు మనసు జీవితమున - కడుగబడిన అనుభవమున
తెరువబడిన నీ హృదయము - విశ్వాసీ అనుక్షణము
ఎక్కాలీ మేఘరధం - అందుకే ప్రక్షాళన... - 3
Verse 2
రక్షణనే ఉచ్ఛరణ చాలదు నీ బ్రతుకులో
నిరీక్షణతో భవితవ్యము సాగించు ముందుకు
మచ్చలేని వధువువై సిద్ధపాటు పొందుకో
రానున్న క్రీస్తువరుని ప్రేమవిందు అందుకో ||అందుకే ||
Verse 3
వాగ్ధానం నీకుంది ఎందుకు సందిగ్ధం
అనుదినము అపవాదితో సాగించుము యుద్ధం
లోకమంత కావాలి యేకమై సిద్ధం
వేదనతో ప్రభుమార్గము చేయుము క్రమబద్ధం ||అందుకే ||
Verse 4
అదిగదిగో ఆకాశం ఎర్రబడిందీ
ప్రభుయేసుని ఆగమనపు వేళయ్యింది
భూకంపన కరువులు వేదనలకు ప్రారంభం
రాజ్యముపై రాజ్యము జనములపై జనము
రేగిన బడబానలం క్షణం క్షణం క్షామం
ఇది రాకకు తార్కాణం ....
విశ్వాసీ నీ హృదయం దినం దినం కావాలి ప్రక్షాళన ప్రక్షాళన ||అందుకే ||