Verse 1
పూజనీయుడా ఓ - రాజాధిరాజా పూజింతు మిమ్ముల
Verse 2
ముజ్జగములకు మూలకర్తవు నీవే - సజీవుడా మిమ్ము
సంస్తుతిజేతము - సంపూర్ణాశీర్వాదమిమ్ము ||పూజనీయుడా ||
Verse 3
అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా ఈ మాపితరుల
వాగ్ధానంబులు - మాయందు నెరవేర్చితివా ||పూజనీయుడా ||
Verse 4
అసహ్యమైన జీవితమును వెడలించి - ఆహా రక్షణ
ఆనంద మిస్తివి - హల్లెలూయా మీకు స్తోత్రం ||పూజనీయుడా ||
Verse 5
సుస్థిరమైన శుభప్రదమైన మీ ప్రేమ - శుద్ధాత్మద్వారా
నివసింపజేసితి - వద్దానికై స్తుతియింతుమ్ ||పూజనీయుడా ||
Verse 6
పుడమిని మేము జడియము నెద్దానికిని - పుణ్యమూర్తి
మీ కృపమాకుండగా - పోదుమా వెనుకకు మరల ! ||పూజనీయుడా ||
Verse 7
అతులితముగ - స్తుతులర్పింతుము ఎల్లప్పుడు - ఆసీనుడవు
కమ్ముస్తుతులపై - ఆ రాజ్యమునకై నడుపు ||పూజనీయుడా ||