Verse 1
వందనం మా యేసువా - వందనం మా ప్రభువా
నిన్ను మేము సేవింతుము - నిత్యము నిన్నే స్తుతియింతుము
నీ నామమునే ఘనపరతుము - నీ ఆజ్ఞలను మేము పాటింతుము
Verse 2
అన్ని నామముల కన్నా - మిన్నైన మా యేసువా
మన్నింపమమ్మిలలో - మహిమను వదలితివీ ||వందనం ||
Verse 3
శాపాల శోకాలతో - పాపాల పాశాలతో
పడియుండిన మమ్మును - విడిపింప వచ్చితివి ||వందనం ||
Verse 4
సిలువపై నీ త్యాగము - విలువైన రక్షణగా
విలసిల్లె మా బ్రతుకులో - వెలుగొందె హృదయాలలో ||వందనం ||