Verse 1
ప్రేమా - ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే
Verse 2
నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా - నాపై నీ ప్రేమధికమయ్యా ||ప్రేమ ||
Verse 3
పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
ప్రేమతెలియగలనా - నీ ప్రేమ లోతునెరుగగలనా ||ప్రేమ ||
Verse 4
ద్రోహినై ఎన్నాళ్ళోనిన్ను - గాంచక నే తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా - నన్ను కౌగలించితివే ||ప్రేమ ||
Verse 5
ఇహలోక సకలమహిమ - పువ్వులవలె వాడిపోవున్
వాడదే అయ్యా - నీ ప్రేమ వాడిపోదయ్యా ||ప్రేమ ||
Verse 6
నీ ప్రేమ మాధుర్యమును - వివరింపతరమౌనె నాకు
అతి సులభముగానే - పరమున వివరించగలను ||ప్రేమ ||