Verse 1
ప్రేమ - ప్రేమ - ప్రేమ - క్రీస్తు ప్రేమ
మరపురానిది - మార్పులేనిది - మధురమైనది
ప్రేమ - ప్రేమ - ప్రేమ - యేసుప్రేమ
అవధిలేనిది - ఈర్ష్యపడనిది - స్వార్ధమెరుగనిది
Verse 2
శ్రమల సుడులలో - విలవిలలాడుచుండగా - 2
నన్నుద్దరించగా - దరిచేరిన ప్రేమ - 2
ఉన్నతప్రేమ - అత్యున్నత ప్రేమ - 2 ||ప్రేమ ||
Verse 3
మరణతలపులు - మనస్సును కృంగదీయగా - 2
కుడిచేయిచాపి నాకు - ధైర్యమిచ్చిన ప్రేమ - 2
కలువరి ప్రేమ - విలువగు ప్రేమ - 2 ||ప్రేమ ||
Verse 4
ధనము బలములు హరించిపోయియుండగా - 2
పరలోకమే శాశ్వతమని - నేర్పిన ప్రేమ - 2
నశ్వరప్రేమ - ఆశ్చర్య ప్రేమ - 2