ఉజ్జీవమిమ్ము మాదేవా నీ ప్రజలమైన మము బ్రోవ
నీ అగ్నిచేత మముకాల్చి - మాదు బ్రతుకులను మార్చుదేవా
తొలిమేడగదిలో అలభక్తవరులు - నినుకూడివేడినారే
యిల చిన్న గుడిలో వెలుగొందనీదు - సన్నిధిని కూడినామే
అగ్నిబోలు ఆత్మన్ బంపి - అందరిని వెలిగించుమయ్యా
వరముల ఫలముల దాతవునీవే - దేవా కరుణించుమా ||ఉజ్జీవ ||
పడియున్న యెరికో బాటసారి గాంచి - వడివడిగా వచ్చినావే
నీ చేయిజాచి తనులేవనెత్తి - యెరుషలేం జేర్చినావే
దారిగానక పడియుంటిమి - కారు మూర్ఖులమైపోతిమి
మార్గము సత్యము జీవము నీవు - దేవా కరుణించుమా ||ఉజ్జీవ ||
ఈ లోకవేషముల మోసపోతిమి - ఆశ్రయంబు నీవే
శ్రీ యేసుదేవా మము గానరావా - మాకుదారి వేరులేదు
నరకకూపపు పొలిమేరలో మమ్ము కలిసిన మాదేవుడా
చేతిని జాపి పాడెను ముట్టి - మమ్ము బ్రతికించవా ||ఉజ్జీవ ||
ఈ మిషను బేధముల - మిషను బోధల చీలిపోతిమయ్యో
కడునామకార్ధ కూటాలు - ప్రార్ధనలవాటు పడితిమయ్యో
దైవ ప్రేమతో మము నింపుమా - నీదురూపము మాకీయుమా
లోకములో దేవుని సంఘముగా - మమ్ము సమకూర్చుమా ||ఉజ్జీవ ||