సువార్త సందేశాలు - విశ్వమంత చాటేందుకు - 2
భారత దేశమందు - ఓరైతు గృహమునందు - 2
మోజెస్ చౌదరిగారే నాడు అభిషేకంతో నిలిచారంట
దైవదర్శనపు జైత్రయాత్రలో ఇరువదైదేండ్లు గడిచాయంట
సువార్తతో ప్రజలందరిలో చైతన్యం పురికొల్పాలంటే
కన్నీటితో కార్యదీక్షతో నిలిచే సేవకులవసరమంట
వేలూ లక్షల ఆత్మలన్నిటిని క్రీస్తు సన్నిధిని కూర్చాలని
మరనాత విశ్వాస సమాజమును మక్కువతో స్థాపించారంట ||సువార్త ||
క్రైస్తవ సంఘ భవితవ్యం యువతపై ఆధారమంట
సౌవార్తిక ఉద్యమంతో సిరులెన్నో నింపాలంట
వాక్యములోను నడవడిలోనూ శిక్షణ పొంది నిలవాలని
మరనాత వేదపాఠశాలను దీక్షతో స్థాపించారంట ||సువార్త ||
తల్లిదండ్రీ దూరమవ్వగా - నా అనువారే కరువైపోగా
బాల్యజీవితం బుగ్గిపాలుగా వీధులపాలు కాకూడదని
దేవుని కొరకూ దేశం కొరకూ అక్కర కొచ్చి వర్ధిల్లాలని
అనాధలం అన్నభావమే మరచి చదువులో రాణించాలని అన్నా!
మరనాత చిల్డ్రన్ హోములు ప్రేమతో స్థాపించారంట! ||సువార్త ||
తమవారెవరూ ప్రేమజూపక అనురాగంతో ఆదరించక
ఛీఛా అంటూ చీత్కరించుకొని ఇంటి బయటకు గెంటివేయగా
ఆదరణిచ్చి, ఆశ్రయమిచ్చి వృద్ధుల బాధలు మరిపించాలని
మరనాత ఆశ్రమమును ఆశతో స్థాపించారంట ||సువార్త ||