Verse 1
ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ
పాపిని నాకొరకు నీకు ఏల శిలువ శ్రమ
Verse 2
శ్రీమంతుడవు సిరికే రాజువు
ప్రార్థించినంతనే కృప చూపువాడవు
కడుదీనుడవై మరియ సుతుడవై
పశుల శాలలో జన్మించినావా - నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందు ||
Verse 3
న్యాయము జరిగించు శాసనకర్తవు
న్యాయాధిపతిగా రానున్నవాడవు
లోకాధికారుల తీర్పుకు తలవంచి
దొంగల నడుమ మరణించినావా-నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందు ||