Verse 1
ప్రేమ ప్రేమ మారనిప్రేమ - పాపిని మార్చును ప్రేమ
పరమును చేర్చును ప్రేమ - డంబములేని ప్రేమ
తొందరపడని ప్రేమ - ముద్రను నిచ్చి భద్రముచేసే
రక్షకుడేసుని ప్రేమ
Verse 2
కలుషంబులను బాప - గొల్గొతగిరిపైన
సిలువలో బలియైనది ..
విలువగు రక్షణ నిచ్చిన ప్రేమ - క్షమియించే నీ ప్రేమ
క్షేమమునిచ్చి - క్షామముబాపే యేసునాధుని ప్రేమ ||ప్రేమ ||
Verse 3
ఘనతమహిమనీకే - స్తుతులకు పాత్రుడనీవె
వేరే వేల్పులు లేరయ్యా - నీవే ఏకదేవుడవు
అద్వితీయ నాధుడవు - మార్పులు రాని శాశ్వతమైన - కన్నతండ్రి నీ ప్రేమ ||ప్రేమ ||