Verse 1
స్తుతియించెదను - స్తుతి పాత్రుడా నిను
భజియించెదను - భయ భక్తితోను - 2
Verse 2
నీ గుణగణములు పొగడను తరమా
నీఘన కీర్తిని పాడనా వశమా - 2
పరలోక సైన్యపు - స్తుతి గానములతో - 2
దీనుడ నా స్తుతి అంగీకరించుమా - 2 ||స్తుతి ||
Verse 3
నీ ఉపకారములు లెక్కింప గలనా
నీ మేలులన్నియు వర్ణింపనగునా - 2
నా హృదిగదిలో నివసింప గోరిన - 2
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా - 2 ||స్తుతి ||
Verse 4
వందనమయ్యా యేసయ్యా - నీకే ప్రణుతులు మెస్సయ్యా - 2