Verse 1
వద్దు వద్దు పాపం జోలికి పోవద్దు...
హద్దుల్లోనె ఉంటేనే ఎంతో ముద్దు
ఈ పొద్దూ ఆ పొద్దూ - స్తుతి చేయుట మానొద్దు
ముద్దు మాటలాడే నోటతొ - వ్యర్ధమైన మాటలు పలకొద్దు || వద్దు ||
Verse 2
సమస్యెంత పెద్దదైనా - విచారమే నీకొద్దు
ఆ సమస్యపై జయమిచ్చేది - యేసయ్యని మరవొద్దు
నిరాశతొ నిట్టూర్పుతొ - పిరికి మాటలాడొద్దు
దీవెనలను పంచే నోటితో - వ్యర్ధమైన మాటలు పలకొద్దు ||వద్దు ||
Verse 3
దేనికీ కొరగానంటూ - ఏ దిగులూ నీకొద్దు
చీటికీ మాటికీ - చింతవైపు మళ్ళొద్దు
పంతాలకు పోయి నీవు - ప్రభు సన్నిధి వీడొద్దు
వాక్యానికి వ్యతిరేకంగా - ప్రగల్భాలు పలకొద్దు
స్తోత్రాలను పాడే నోటితో - వ్యర్ధమైన మాటలు పలకొద్దు ||వద్దు ||