Verse 1
నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు... అతడే యేసుడు (2) ||నేనెరుగుదును||
Verse 2
చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును||
Verse 3
చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||