Verse 1
లేలే యువకా నేడెరా - కావగ ప్రభుని పాడరా
లేదుర సమయం - వదలర బిడియం లేచి వడిగా సాగాలిరా - 2
Verse 2
పొందుము నూతన జీవితం - ముందుగ నిలిపి ప్రభుధ్వజం
పందెము నందున డెందము నిలిపి పొందరా విజయము ||లేలే ||
Verse 3
యేసు మాటలే మార్గమని - యేసు మాటలే సత్యమని
యేసే జీవము యేసుని సాక్ష్యము నిరతము చాటరా ||లేలే ||
Verse 4
మహిమతో మన ప్రభువు వచ్చునని
ఇహమున రాజ్యము నేలునని
మహిలో గల ప్రతి మానవునికిని సహితము తెలుపరా ||లేలే ||