Verse 1
ఏమిచ్చావని దేశాన్నడిగేకన్నా - దేశానికి నీ వేమిచ్చావన్నదే ఎంతో మిన్న
ఆత్మ సంబంధమైన పోరాటాలలో - భారముతో కన్నీరు కార్చి గెలిచావా నీవు
జాతిని జాగృత పరచేటి కార్యాలలో - మూల స్థంభానివై ఆధారమయ్యావా
అ:ప: దేశముపై కృప చూపించే - యేసుకే జయం
ప్రతి బంధకాలను త్రెంచేే క్రీస్తుకే జయం జయం జయం
Verse 2
మూఢాచారాలు ఉగ్రవాద భావాలు
దౌర్జన్యాలు హత్యా పాతకాలు
ఈ దౌర్భల్యాలను ఆపే శక్తి క్రీస్తు ప్రేమకే ఉన్నది
శాశ్వత ప్రేమ అనంత ప్రేమ అద్భుత ప్రేమ కల్వరి ప్రేమ
ఆ ప్రేమను పంచే శాంతి ప్రబోధం నీలో నింపబడినది ||2 ||
Verse 3
దోపిడి భావాలు - లంచగొండి రోగాలు
భ్రూణ హత్యలు - అవినీతి అక్రమాలు
ఈ అకృత్యాలను అణచే శక్తి - క్రీస్తు కరుణకే ఉన్నది
వీడని కరుణ ఉన్నత కరుణ
తరుగని కరుణ చెరగని కరుణ
ఆ కరుణను పంచే క్రీస్తు హృదయం నీలో ఉంచబడినది ||2 ||