Verse 1
నీవున్న ఈ గృహము ఆనంద నిలయము
నాకున్న ఈ సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము
Verse 2
నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్ధము
నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే ||ప్రభు ||
Verse 3
నీవే కావలి కాయనిచో - మేల్కొనియుండుట వ్యర్ధమే
నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే ||ప్రభు ||
Verse 4
నీవే కృపగల దేవుడవు మేలులతో తృప్తిపరచెదవు
నీవే సర్వ సమర్ధుడవు సమృద్ధితో నను నింపెదవు ||ప్రభు ||
Verse 5
ప్రభు స్తుతియించెదం - నిన్ను ఘనపరచెదం - మేమూ మా యింటివారును