Verse 1
యేసుక్రీస్తు నిజ దేవుడురా - భాసుర ప్రేమ సజీవుడురా,
వాసిగ పరమ నివాసమీడిన - దోషకారుల బంధువురా
Verse 2
దివ్యబోధనిలజాటెనురా - భవ్యపధంబును జూపెనురా,
అవ్యయమగు శ్రీయేసు రాజ్యపు - కావ్య గీతికలు పాడుమురా ||యేసు ||
Verse 3
సిలువ భారమును మోసెనురా - ఖలుల మనసు నిలమార్చెనురా,
చెలువగ మనకై రక్తము కార్చి - విజయుడై మృతి గెల్చెనురా ||యేసు ||
Verse 4
భక్తులకిల కనిపించెనురా - ముక్తి దాత పరమేగెనురా,
శక్తి నొసగుటకు పరిశుద్ధాత్ముని - రక్తిమీర భువికంపెనురా ||యేసు ||
Verse 5
నమ్మినవారికి నెమ్మదిరా - నమ్మని వారికి నరకమురా,
ఇమ్మహి తీర్పును తీర్చుట కొరకై - క్రమ్మర భువికరుదెంచెనురా ||యేసు ||