Verse 1
నమ్మకమైన దేవుడవు - నాకు దొరికావు
నమ్మదగని నన్ను - నీ ప్రేమతో పిలిచావు - 2
Verse 2
గమ్యము లేని నా బ్రతుకునకు - గురియై నిలిచితివి
అధ్వాన్నపు నా జీవితమును - రమ్యముగా మలచితివి - 2
శరణము నీవే ప్రభో.. నీ చరణములే నమ్మితి - 2
కనికరముతో నీ కరమును చాపి వరముల నిచ్చితివి
మరణము వరకు పరిపరి విధముల మరినిను పొగడెదను - 2 ||నా మది ||
Verse 3
దూషించబడుతూ దీవించే - ధన్యత నొసగితివి
నిందించబడుతూ ప్రేమించే - భాగ్యము నిచ్చితివి - 2
బలిఅర్పణ జేతునూ.... జీవితం ప్రియముగ నీసేవలో - 2
కష్టములెన్నైనా నష్టములెదురైనా
నిష్టూరములెన్నైనా నిత్యము నీతో సాగెదను - 2 ||నా మది ||
Verse 4
నా మది ఆశించే లోకాశలు తొలగించితివి
నీ వాక్కుతొ నను సంధించి నీ ఆత్మతో నింపితివి - 2