Verse 1
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైతే లాభము
Verse 2
గుంపులు నన్ను చంపుముయనుచు - కేకలు వేసి పొర్లినను
సౌలుగా నుండ మరి పౌలుగ మార్చబడన్
దేవుని దర్శనమొందితిని ||నామట్టుకైతే ||
Verse 3
చెరసాలలో మము బంధించినను - కొరడా దెబ్బలు కొట్టినను
గానము చేయ - మరి ప్రార్ధన చేయ
బంధకములు ఊడినయపుడు ||నామట్టుకైతే ||
Verse 4
ఉపవాసములతో జాగరణములతో - అరణ్య ఆపదలలో
చాల మారులు - మరి నిందలు వేలు
వేసి హింస పరచినను ||నామట్టుకైతే ||
Verse 5
వెనుకటి వన్నియును మరచి ముందున్న వాటిని తలచి
వేగిరపడుచు - మరి ఓర్పుతో జనుచు
గురియొద్దకు నే చేరెదను ||నామట్టుకైతే ||
Verse 6
కరువైనను సరే ఖడ్గంబుమరి - వస్త్ర హీనతయైనను
ఉన్నవియైనా - రానున్నవియైనా
ప్రభు ప్రేమనుండి యెడబాపవు ||నామట్టుకైతే ||