Verse 1
ప్రాణప్రియుడా యేసు రాజ పరమరక్షకుడా - 2
పరమునందు, ధరణియందు - 2
ప్రభుడనీవెకదా మాకు ప్రియుడ నీవెకదా - 2 ఆ... ఆ... ఆ... ఆ...
Verse 2
అతనిస్వరము అతిమధురము
అతని ముఖము మనోహరము - 2
అతని జిహ్వ మధురక్షీరము - 2
వెలుగు చుండెనుగా తేనియ లొలుకుచుండెనుగా ఆ..ఆ.. ||ప్రాణ ||
Verse 3
ధవళవర్ణుడూ, రత్న వర్ణుడు రాజులకును రారాజూ - 2
పదివేలమంది పురుషులలో ఈ ప్రియుడు లేడుగా
వేరే ప్రియుడు లేడుగా ఆ... ఆ... ||ప్రాణ ||