Verse 1
అతి కాంక్షనీయుడు నా యేసు - అతి ప్రియుడు నా యేసు
మనోహరుడు యేసు అతి మనోహరుడు యేసు
అతిశయింతును నా యేసుతో - పరవశింతును నా ఆత్మలో
హల్లెలూయా - 6 హల్లెలూయా ఆమెన్ ! ఆమెన్ !!
Verse 2
అతి సుందరుండు నా యేసు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
బలవంతుడు యేసు అతి బలవంతుడు యేసు ||అతిశయింతును ||
Verse 3
మధురాతి మధురము నా యేసు నామం
అతి ఉన్నతం అతి సర్వోన్నతం
శక్తిగల నామం అతి శక్తిగల నామం ||అతిశయింతును ||