Verse 1
తండ్రి నిన్ను చూడాలని దేవా నిన్ను పాడాలని ||2||
ఆత్మతో సత్యముతో పాడాలని
నా మనోనేత్రములతో చూడాలని ||2||
నాలో ఆశ కలుగుచున్నది
నా మనస్సు నీకొరకై వేచియున్నది ||2||
Verse 2
నా పాప భారాన్ని మోశావని
నా పాత జీవితం మార్చావని
పరిశుద్ధతతో నన్ను నింపావని
పరలోక మహిమకై నిలిపావని ||2||
నాలో ఆశకలుగుచున్నది
నా మనస్సు నీ కొరకై వేచియున్నది -2 ||తండ్రి ||
Verse 3
నా అరచేతిలో చెక్కానని
భయపడకు నీకు తోడు వుంటానని
వాగ్ధానము ఇచ్చిన దేవుడవు నీవని
మరనాత నిన్ను పాడాలని
నాలో ఆశ కలుగుచున్నది
నా మనస్సు నీ కొరకై వేచియున్నది || 2 || ||తండ్రి ||
Verse 4
పాపియైన సౌలును పిలిచావుగా
పరిశుద్ధ పౌలుగా మార్చావుగా
ద్రోహినైన నన్ను పిలిచావని
నీ మహిమకై ఆత్మతో నింపావని
నాలో ఆశ కలుగుచున్నది
నా మనస్సు నీకొరకై వేచియున్నది || 2 || ||తండ్రి ||