Verse 1
పరిశుద్ధ గ్రంధరాజ సుగంధం - ఈ పవిత్రగ్రంధం
మధురాను భూతినిచ్చే మకరంధం - ఈ బైబిలుగ్రంధం
పఠన చేయువారికే - రక్షణనందుకున్న వారికి
కలిగించును పరలోక ఆనందం - సజీవగ్రంధం ఈ దివ్యగ్రంధం
Verse 2
దైవమే... వాక్యమై నరుని చేతిలోకొచ్చిన గ్రంధము - 2
రక్షణే దీని లక్ష్యము - చేర్చును పరలోకరాజ్యము
శక్తినిచ్చును ముక్తినిచ్చును - జయం పొందగలుగు బలమునిచ్చును ||పరిశుద్ధ ||
Verse 3
సత్యమే సందేశమై - శభవార్తలతో నిండినట్టి గ్రంధము - 2
శాంతము సంతోషము - ప్రేమే సర్వస్వమైన గ్రంధము
జ్ఞానమిచ్చును - జీవమిచ్చును - మోక్షరాజ్యమందు స్థానమిచ్చును ||పరిశుద్ధ ||