Verse 1
ఈలోక సంద్రమున - నా జీవితనావను
నడిపేది ఆ యేసుడే - దరిచేర్చు ఆ దేవుడే
Verse 2
పెనుగాలులే వీచినా - తుఫానులే తరిమినా - 2
పరలోక నాధుండు - ప్రభు అండ నీకుండ - 2
భయమేల ఓసోదరా - నిశ్ఛింతగాసాగుమా ||ఈలోక ||
Verse 3
ఆపత్కాలమందునా - ఆశించి ప్రార్ధించినా - 2
ఆదరణ లేదని దుఃఖించబోకుమా - 2
ప్రభుచిత్తమను పాత్రను - ఆనందముగ త్రాగుమా ||ఈలోక ||
Verse 4
ప్రభుయేసే నీమార్గము - పరలోకమే గమ్యము
ప్రభుసన్నిధిని విడిచి - పయనించబోకుమా - 2
విభుడేసే చుక్కానిగా - ప్రభుజాడలో నడువుమా ||ఈలోక ||