Verse 1
శిష్యులము మేము - యేసు శిష్యులం
భూదిగంతముల వరకు - భూమి మీద ఉండువరకు
దివ్యమైన సువార్తను - ప్రకటించు పత్రికలం || శిష్యులము ||
Verse 2
భూపునాది వేయకముందే మమ్మునెన్నుకున్నాడు
దివ్యమూర్తి దీనదయాళు ఈ దీనుల పిలిచాడు
వాడ వాడలా మేము వాక్యమును బోధించెదము
వద్దన్నా కాదన్నా టముకువేసి చాటించెదము ||శిష్యులము ||
Verse 3
లోకానికి ఏవిధముగను హానికావు మా బోధలు
సత్యవార్త చాటించుటలో భరించెదము ఎన్నోబాధలు
లోకాన ఎంచిచూడ ఈ శ్రమలు ఎంతో అల్పం
పరవశించి పాడుటయే మాదు దృఢ సంకల్పం ||శిష్యులము ||