మేలుకో మేలుకో - భారత క్రైస్తవ యువకా
మేలుకో మేలుకో - క్రైస్తవ యువతీ యువకా
నేడు నీవు లేవాలి - క్రీస్తు కొరకు లేవాలి - లేచి ప్రకాశించాలి || మేలుకో ||
బీడైన భూమిలా - ఎండిన యెడారిలా
కఠినమైన శిలలా - కదిలే రెల్లులా
మోడైన జీవితాలు - నీయెదుట నున్నవి
ఓడిపోయి వాడిపోయి - రాలిపోవుచున్నాయి
నిండు యవ్వనమందే - నేటి యువతీ యువకులు
నీ సోదర సోదరీలు ||మేలుకో ||
ముందుగతి ఎరుగక - దుర్గతిలో ఉన్నవారు
నిజస్థితిని గుర్తించక - దుస్థితిలో ఉన్నవారు
దేవునికి వ్యతిరేకులై - మతిని మార్చుకోలేక పతనమౌతున్నారు
నీ వంటి యువకులెందరో
దేవుడే లేడనుచూ - దూరమౌతున్నారు ||మేలుకో ||
నీ ఇంటి వారిని - నీ సొంతవారిని
నీ దేశ ప్రజలను - నీ స్నేహితులను
రక్షించు భారముతో - నీ గుండె మండాలి
కన్నీటి ధారలతో - విజ్ఞాపన చేయాలి
సత్యానికి సాక్షివై రక్తమే కార్చాలి
నేటి యువతరమును - సిలువ చెంత చేర్చాలి ||మేలుకో ||