Verse 1
మంచి దేవుడ నీవు విమోచకుడవు చాలిన దేవుడవు
సాటిలేని దేవుడవు ప్రేమించు దేవుడవు మాట్లాడే దేవుడవు
నిజమగు దేవుడవు నన్నెరిగినవాడవు నమ్మదగినవాడవు నా యేసయ్యా - 2
యేసయ్య యేసయ్య నీకే వందనము - యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
Verse 2
ఎడారి బ్రతుకులో కలువ పూసెను సిలువ విజయమే అది కలువరి చలువే
అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే చీదరించక నన్ను చేరదీసితివే
నాలాంటి వానికి దేవుడిగా వుండుటకు - ఇష్టపడితివే నీవు జేష్టుడైతివే - 2 ||యే ||
Verse 3
కుదురని రోగము నన్నావరించగా స్వస్థతైతివి నాకు విడుదలైతివీ
రేపేమి జరుగునని భీతిచెందగా అభయమైతివి నా నిరీక్ష ణైతివి
నీ కంటి పాపలా నన్ను కాపాడితివి - కారణం నీవే నే పాడే ప్రతి పాటకు - 2 ||యే ||