Verse 1
పోదాము రండి, పోదాము రండి వెలుగును పంచుటకు
పోదాము రండి పోదాము రండి మంచిని పంచుటకు
Verse 2
చేశాడు దేవుడు మేలులు ఎన్నో గడచిన దినములలో
ఇచ్చాడు మనకు దీవెనలెన్నో యేళ్ళకు సరిపడగా
పోదాము రండి పోదాము రండి కృతజ్ఞత భావముతో - 2
దేవుని కొలుచుటకు - దేవుని కొలుచుటకు ||పోదాము ||
Verse 3
పంచాడు దేవుడు వరములు ఎన్నో - గడచిన మన బ్రతుకులో
నింపాడు మనలను యేసు ప్రేమతో - అద్భుత విధముగను - 2
పోదాము రండి, పోదాము రండి
శుభవార్త చాటుటకు - శుభవార్త చాటుటకు ||పోదాము ||