Verse 1
గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన
మానవాళి విడుదల కొరకైన ప్రార్ధన - 2
నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్ర మనపాప ఫలితమే || గెత్సెమనె ||
Verse 2
ఘోరమైన శ్రమలెన్నో పొందాలని
కలువరి వరకు సిలువ మోయాలని - 2
ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను
తన తండ్రి చిత్తమునకు తలవంచెను - 2 ||నీ కోసమే ||
Verse 3
కొంచెమైన మంచితనము లేని పాపిని
సంపూర్ణ స్వస్థతతో నింపాలని - 2
గాయములు పొందుటకు సిద్ధమాయెను
తన తండ్రి చిత్తమునకు తలవంచెను - 2 ||నీ కోసమే ||
Verse 4
క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని
అక్షయమగు రాజ్యములో చేర్చాలని - 2
తన తండ్రి చిత్తమునకు తలవంచెను - 2 ||నీ కోసమే ||