Verse 1
చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా (2)
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను... చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
Verse 2
లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను... చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
Verse 3
ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2)
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను... చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే||
Verse 4
ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2)
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను... మరువలేనయ్యా నీ ప్రేమ (3)