Verse 1
మరనాత ప్రభువు వచ్చుచున్నాడు
ఆమేన్ - హల్లెలూయ - 2
రాజాధిరాజుగా ప్రభువుల ప్రభువుగా యేసు వచ్చున్నాడు
ఆమేన్ - హల్లెలూయ - 2
హల్లెలూయ - 4 ఆమెన్ యేసు రమ్ము
Verse 2
బలియాగము కొరకు - పాప పరిహారము చేయుటకు
మొదట తాను ఏతెంచెను - గొర్రెపిల్ల రీతిగా ||ఆమెన్ ||
Verse 3
ప్రధాన దూత శబ్దముతో - కొదమ సింహంబుగా
ఆర్భాటముతో రానుండే - రాజాధి రాజుగా ||ఆమెన్ ||
Verse 4
వధువుగా సిద్ధమైన - పరిశుద్ధుల సంఘముకొరకు
మేఘమాలికా రధాన - వరుడై రానుండే ||ఆమెన్ ||
Verse 5
స్థిరమగు విశ్వాసముతో - పరిపూర్ణతలో కొనసాగి
మెలకువతో ప్రార్థించు - యేసును సంధించు ||ఆమెన్ ||
Verse 6
పాపిగా నీవున్న - నరకాగ్ని పాలగుదువు
యేసుని స్వీకరించిన - మోక్షము చేరుదువు ||ఆమెన్ ||