Verse 1
నా హృదయం పాడెనొక గీతం సర్వోన్నతుని నామ స్మరణం
సంగీత సువార్త సునాదం క్రీస్తేసు సంతోష గానం
Verse 2
సిలువలో జరిగినట్టి - ఆ రక్షణ కార్యము కొరకై
సిలువలో చిందించినట్టి - పాపక్రయధనము కొరకై
పాడెద - కృతజ్ఞత ఈగీతం ||నా హృదయం ||
Verse 3
పాపపు లోకం నుండి - నను బ్రతికించెనని
మరణపు పాశమునుండి - నను విడిపించెనని
పాడెద - విమోచన ఈ గీతం ||నా హృదయం ||
Verse 4
మరణము గెల్చి ప్రభు - పరమునకేగెనని
మరల తన రాజ్యముకై - త్వరలో వచ్చునని
పాడెద - నిరీక్షణ ఈ గీతం ||నా హృదయం ||