తార జూపిన మార్గమదే... జ్ఞానులు చేరిన గమ్యమదే...
గొల్లలు గాంచిన స్థానమదే... లోక రక్షకుని గూర్చినదే...
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2)
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా....
తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2)
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2)
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా.. ||తార జూపిన||
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2)
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2)